TeluguBrains

Stories from Members

Home
Teams Information
In Media
Telugu Software
OPMS
Poetry from Members
Stories from Members
Dramas from Members
Telugu Excel Templates
Moral Stories
Translated Stories
Mail to Govt Departments
Important Links

దేముడు మేష్టారు  (కధానిక)

రచన: కాలనాధభట్ట వీ రభద్ర శాస్త్రి
 
**   **   **
ఆయన పేరు శాస్త్రి  హైస్కూల్లో మేష్తారు
అరె! మీకెల్లాతెలిసింది !! అవును ఆయన తెలుగు మేష్టారే!!
పాపం చాలా మంచి మనిషి. జాలిగుండె. పిల్లల్ని కొట్టరు తిట్టరు.
ఆయనకు స్కూల్లో పిల్లలు దేముడుమేష్టారు అని పేరుపెట్టారు.
ఒకసారి స్కుల్లో  పాఠం చెప్తూ బోర్డ్ మీద వ్రాయడానికి పక్క జేబులోంచి సుద్దముక్కతీయబోతే, కరీం బీడీ చేతికి వచ్చింది.  పిల్లలంతా ఒక్కసారి గొల్లుమని నవ్వారు. అప్పట్నించీ ఆయన్ని కరీం బీడీ గారని కూడా పిల్చేవారు. బీడీ కాల్చడం ఒక్కటే ఆయనకున్న దుర్గణం (ఇది దుర్గణంగా పరిగణిస్తే).
ఒకసారి అటెన్డెన్సు వేస్తున్నారు. కొంతసేపు అయ్యాక ఆగి ఇదిగో సుబ్బారావ్ నువ్వు ఇప్పటికి నలుగురుకి ప్రెజెన్ట్ పలికావు.  ఇక పక్కవాడికి చాన్స్ ఇయ్యి అన్నారు.  మేస్టారూ ఈవేళ నాకోటా  ఆరు అన్నాడు సదరు సుబ్బారావు అనే మంచి బాలుడు. కొత్తలో అయితే క్లాసులోకి రాగానే అబ్బాయిలూ నా క్లాసు ఎవెరికైనా నచ్చకపోతే వాళ్ళు హాయిగా నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు అనగానే ముందు వరసలొ వున్న ఆడపిల్లలు తక్క మిగిలిన మగపిల్లలు అందరూ వెళ్ళిపోయారు.  కాని ఆశ్చర్యం ఏమిటంటే రాను రాను శాస్త్రిగారు పాఠం చెప్తూవుంటే ఆకర్షితులై ఎవరూ క్లాసు వదలి వెళ్ళలేదు. ఆయన పద్యం రాగయుక్తంగా చదువుతూవుంటే అపర ఘంటశాలా అనిపించేటట్టుగావుండేది. 
క్రమేణా పిల్లలకు ఆయనపైన మంచిగురి ఏర్పడింది. కాకపోతే మిగిలిన మేష్టర్లంత స్ట్రిక్ట్ కాదుకనుక, రకరకాలగా ఏడ్పించేవారు.

ఒకసారి శాస్త్రిగారు క్లాసులోకి ప్రవేశించారు. క్లాసు ఆరోజు చాలా నిశ్శబ్దంగావుంది. అందరూ ఉత్కంఠతతో  చూస్తున్నారు. శాస్త్రి కి వాతావరణంలో ఏదో కృతిమం కనపడింది.  తిన్నగా వెళ్ళి  ఖండువా కుర్చీమీద వేసారు. అది జారి కుర్చీలో పడింది. దాన్ని తీయబోతే చేతికి ఏదో గుచ్చుకుంది. కుర్చీ మధ్యలో జాయింటులో ఒక గుండుసూది నిలబెట్టబడివుంది. శాస్త్రి తలెత్తి ఒకసారి క్లాసుకేసి చూసారు.  కుర్చీ కొంచెం వెనక్కి లాగి పిల్లలకేసి చూసి, ఈ వేళ మీరు ఒక చక్కటి ప్రహసనం చూడాలనుకొని ఈ గుండుసూది కుర్చీలో పెట్టారు. నేను చూసుకోకుండా కూర్చుంటానని నాకు గుచ్చుకుంటుందని వూహించుకొన్నారు. ఇంతమంది నా శిష్యుల కోరికను వమ్ము చేయను. నాకు గుండుసూది గుచ్చుకొని నేను బాధపడటంవల్ల మీకు ఆనందం కలుగుతుందంటే మిమ్మల్ని ఎందుకు నిరాశ పరుస్తా. అని కుర్చీలో కూర్చొని ఏమీ జరగనట్టు అటెన్డన్సు రిజిష్టర్ తీసాగారు. పిల్లలు  అవాక్కయ్యారు.
సుబ్బారావు లేచి క్షమించండి మేష్టారూ ఈ  తప్పు ఆలోచన నాదే. చేసింది కూడా నేనే. నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నా అన్నాడు. వెంటనే మిగిలిన పిల్లలందరూ లేచి నిల్చుని మూకుమ్మడిగా క్షమించండి మేష్టారూ అన్నారు.
అప్పుడు శాస్త్రిగారికి కళ్ళమ్మట నీళ్ళు జలా రాలాయి.

మరి అవి బాధాపూరిత జలాలో, పిల్లలలోని పరివర్తనకు ఆనందాశృవులో ఆ పరమాత్ముడికే తెలియాలి.
 
** ** **
 

పెద్దలు vs  పిల్లలు

రచన: కాలనాధభట్ట వీ రభద్ర శాస్త్రి

ఈ కధ నాచిన్నతనంలో (1934 లో) తెలుగు వాచకంలో చదివాను. మంచి నీతివుంది.


ఒక గ్రామంలో సాయంత్రం సమయంలో కొంతమంది పిల్లలు
ఆడుకుంటున్నారు. వాళ్ళలో వాళ్ళకి ఏదో పేచీ వచ్చింది. ఒకరినొకరు తోసుకోవడంలో రంగడనే పిల్లవాడు కిందపడ్డాడు. వెంటనే గట్టిగా ఏదుపు మొదలుపెట్టాడు. అదివిని వాడి తల్లి గబగబా చక్కావచ్చి ఎందుకు ఏడుస్తున్నావని అడిగింది. రాజు నన్ను తోసాడు అందుకు కింద పడ్డా అన్నాడు వెక్కుతూ
ఏరా రాజూ! ఎందుకు తోసావు అని వాడి వీపుమీద రెండు బాదింది. దాంతో రాజు ఏడవడం మొదలుపెట్టాడు. రాజు తల్లి  వచ్చి సంగతి తెలుసుకొని ఏమ్మా! మా వాడిని కొట్తావా! నీ చేతులు విరిగిపోనూ అని తిట్టసాగింది. ఈవిడ గట్టిగా కేకలు పెడ్తూ సమాధానం ఇచ్చింది. అల'ా అల'ా వాగ్వివాదం పెరిగింది. ఇంతలో వారి భర్తలు చక్కావచ్చారు. రాజు తండ్రి సంగతి విని ఏమ్మా మావాడిని కొట్టడానికి చేతులు ఎల'ా వచ్చాయమ్మా అని కేకలు వేసాడు. రంగడు తండ్రి కలగచేసుకొని రాజు తండ్రిని నువ్వెవరవయ్యా మా ఆవిడిని కూకలెయ్యడానికి అని గయ్‌ మన్నాడు. మాటామాటా పెరిగింది. ఆడవాళ్ళైతే జుట్టు జుట్టూ పట్టుకొని, మగవాళ్ళేమో బాహాబాహీ ముష్టి యుద్ద'ంతో ఆ ప్రదేశం ఒక చిన్న సైజు రణరంగం అయింది.
ఆ సమయంలో బడి పంతులు రామయ్యగారు వచ్చారు. ఆగండి ఆగండి అని ఇరుజట్టులచేత యుద్ద'ం మానిపించారు. సంగతేమిటి అని అడిగి తెలుసుకున్నారు.

ఓష్‌ ! పిల'లు ఏదో ఆటల'ొ కొట్టుకున్నారని మీరు ఇంత గందరగోళం చేస్తున్నారా! ఒకసారి అటు చూడండి అని పిల'లకేసిచూపించారు. అప్పటికే రాజు రంగడుతోసహా పిల'లు మళ్ళీ ఆటల'ొ ములిగిపోయారు.
చూసారా! ఏ పిల'లు కొట్టుకున్నారని మీరు ఇంతగా దెబ్బలాడుతున్నారో వాళ్ళే జరిగిన సంఘటన మరిచిపోయి మామూలుగా కలిసిపోయి హాయిగా ఆడుకుంటున్నారు. మీరు వాళ్ళగురించే కొట్టుకుంటున్నారనే సంగతే వాళ్ళు పట్టించుకోలేదు. చిన్న చిన్న విషయాల'ొ' ఇల'ా మీరు అనవసరంగా కలగచేసికొని మీమధ్య వున్న స్నేహభావాన్ని కలుషితం చేసుకుంటున్నారు. ఆ పిల'లు జరిగిన సంఘటన మరిచిపోయి హాయిగా కలిసిపోయారు. మరిమీరు అల'ా కలవగలరా! ఈ కోపం వాళ్ళలా తేలిగ్గా మరిచిపోగలరా?
కనుక, ప్రతి చిన్న విషయానికి ఆవేశం తెచ్చుకోకుండా నిదానించడం, చూసి చూడనట'ువ్యవహరించడం ఎంతో మంచిది. అదే ఐకమత్యానికి పునాది

ఆ మాటలకి ఇరువైపు పెద్దలు సిగ్గుతోతలలు వంచుకొన్నారు.


*******************

 

గిఫ్ట్ లోఅంతరాలు

రచన: కాలనాధభట్ట వీ రభద్ర శాస్త్రి

ఇది నేను ఎప్పుడో విన్నకధ.  నాస్వంత మాటలలో చెప్తున్నా పేర్లు మార్చి.
శాస్త్రి వుసూరుమంటూ కుర్చీలో కూలబడ్డాడు. అప్పటికి నలుగురినైనా అడిగాడు అప్పుకోసం. ప్రతివారూ సారీ అన్నవారే! నిజంగాలేకో, లేక తనమీద నమ్మకంలేకో.
ఎల్లుండే ఆఫీసరుగాభార్య పుట్టినరోజు. పెద్ద అట్టహాసంగా జరిపే పార్టీకి స్టాఫ్ అందర్నీ ఆహ్వానించారు ఆఫీసరు. ఆఫీసులో తలొకరూ ప్రెజెంటేషన్లు కొంటున్నారు. తనే ఇంతవరకూ ఏమీ కొనలేదు. నెలాఖరు రోజులు. చేతిలో పట్టుమని వందరూపాయలులేవు. అధమం రెండువందల రూపాయల చీరైనా కొని ఇవ్వకపోతే బాగుండదు. ఎంచెయ్యాలో పాలుపోక కూర్చున్న శాస్త్రి మనస్సులో గబుక్కున ఒక ఆలోచన మెలిగింది. భార్య చేతిని వున్న గాజులు తాకట్టు పేదితేనో!! ఆలోచన రాగానే గబగబా ఇంటికి వెళ్ళాడు. ఎంతో బ్రతిమాలగా అయిష్టంగానే భార్య గాజులు తీసి ఇచ్చింది.

చేత్తో గిఫ్త్ ప్యాకెట్టుతో శాస్త్రి దంపతులు ఫంక్షన్ హాలులోకి అడుగుపెట్టారు. అబ్బో! ఎంతమందో! ఖరిదైన సూట్లు, రెపరెపలాడే సిల్కు చీరలు, ధగధగమెరిసేనగలతో హాలు కళకళలాడుతోంది.  ఒకపక్క గా స్టాఫ్  నిల్చున్నారు. ఒక్కొక్కరే తము తెచ్చిన గిఫ్టులను ఆఫీసరుగారి భార్యకు ఇచ్చి శుభాకాంక్షలుచెప్తున్నారు. శాస్త్రి దంపతులు కూడా వెళ్ళి తాము తెచ్చిన్ గిఫ్ట్ ప్యాకు ఇచ్చి బుజాలమీద బరువు దింపుకొన్నట్టు ఫీలై ఇవతలకి వచ్చారు.

రెండురోజుల తర్వాత శాస్త్రి దంపతులు సాయంత్రం వుబుసుపోక పార్కుకు వెళ్ళారు సినిమాకివెళ్ళడానికి ఆర్ధిక ఆభావంతోకుదరక. ఒకచోట శాస్త్రి భార్య ఠక్కున ఆగిపోయింది. ఒకసారి అటుచూడండి అంది భర్తతో. ఆఫీసరుగారి అమ్మాయిని ఆడిస్తోంది పనిమినిషి.   వారి దృష్టిని ఆకర్షించింది ఆదృశ్యం కాదు, ఆ పనిమనిషి కట్టుకొన్న చీర.
అది శాస్త్రి దంపతులు ఆఫీసరుగారి భార్యకు పుట్టినరోజు గిఫ్ట్ గాఇచ్చిన చీర. 

*******************************************


 

బహువ్రీహి

రచన: కాలనాధభట్ట వీ రభద్ర శాస్త్రి
 
మహారాజు రాజధాని నుండి అప్పుడప్పుదు తన సామ్రాజ్యంలో పరిస్థితి గమనించడానికి మందీ మార్బలం తో వెళ్తూవుంటారు. అల్లా వెళ్ళేసమయంలో ఎక్కడెక్కడ మకాంచేసినా అక్కడ ఏదో వినోదకార్యక్రమమొ, కవితాగోష్టో ఏర్పాటయ్యేది. ఒకసారి ఒక గ్రామళో మకాం చేసారు. ఆగ్రామంలోనే ఒక కవి వచ్చి తనువ్రాసిన కావ్యాన్ని వినిపించారు. ఆ కవిగారి కావ్యగానానికి మహారాఉ ముగ్ధుడై కరణాన్ని పిలిచి ఈ కవిగారికి అయిదెకరాల భూమి ఈనాముగా ఇస్తున్నాము. మీరు సరి అయిన భూమి చూసి వారిపేర పట్టావ్రాసి ఇవ్వండి., అని తాఖీదువేసారు. మహారాజు వెళ్ళిపోయారు. కరణం చుట్టూ నాలుగైదు నెలలు తిరిగాక, కరణం వూరి చివర తటాకోత్తర భూమి అయిదెకరాలు ఇచ్చినట్లు దానపట్టా వ్రాసి కవిగారికి ఇచ్చాడు. 
మంచిరోజు చూసి, కవి భూమిని  సాగుచేసుకోడానికి వెళ్ళిచూస్తే అది శ్మశానభూమి. కవి నిర్ఘాంతపోయి. ఇది తాను లంచం ఇవ్వని కారణంగా కరణం చేసిన మోసం అనిగ్రహించి, అధైర్యపడక, వెంటనే తటాకానికి దక్షిణంగా వున్న భూమిని సాగుచేయడం మొదలుపెట్టాడు.  ఇది విని కరణం హుటాహుటిని చక్కావచ్చి ఏమయ్యా నీకు ఇచ్చిన భూమి అటు వుత్తరం వైపు వున్నది కాని ఇది కాదు. ఇక్కడ వ్యవసాయం చేయడానికి ఎంతమాత్రం వీలులేదు అన్నాడు. కాదు మీరు ఇచ్చింది ఇదేభూమి. నేను దీనినే సాగుచేస్తాను అని మొండికేసాడు. కవి అంటే అభిమానం వున్న వూరిలోని కొందరు యువకులు, గ్రామస్థులు కూడా కవిగారికి వత్తాసు పలకడంతో కరణం ఏమీ చెయ్యలేక, మహారాజుకు ఫిర్యాదు చేసాడు కవి తనకు  దానమిచ్చిన భూమిలొ కాకుండా మరొకచోట అన్యాక్రాంతం చేసాడని.

మహారాజు మళ్ళీ సామ్రాజ్య సంచారంకుబయల్దేరినప్పుడు, ఈ గ్రామానికి వచ్చి కవిని, కరణాన్ని, గ్రామస్థులను న్యాయ విచారణకోసం పిలిచారు. కరణం వచ్చి దానపట్టా నకలు మహారాజుకు చూపించాడు.  మహారాజు కవికేసి చూసి ఏమండీ కవిగారూ ఇందులో తటాకోత్తరభూమి అని షష్టీతత్పురషలో స్ఫష్టంగా వుందికదా మరి మీరు తటాకానికి దక్షిణభూమిని ఎందుకు ఆక్రమించారు అని అడిగారు.
అప్పుడు కవిగారు ఇల్లా సమాధానం ఇచ్చార

చిత్తం మహాప్రభూ! నేను షష్టీ తత్పురష సమాసంగా పరిగణించలేదు.  తటాకము వుత్తరముగా కలది అనే అర్ధంతో ఈ దక్షిణభూమిని సాగుచేస్తున్నా
వెంటనె మహారాజు అయితే మీరు షష్టీ తత్పురుషబదులు బహువ్రీహి సమాసంగా పరిగణించారన్నమాట
అవును ప్రభూ! షష్టీతత్పురుష అయితే ఆ భూమి శ్మశానభూమి. తాము దానమిచ్చినది నాకు బహువ్రీహి కావాలనే సదుద్దేశ్యంతోగదా (బహువ్రీహి అనగా ఎక్కువగా ధాన్యం ఇచ్చ్చునది అని అర్ధం)  అని మనవిచేసాడు.
మహారాజు కవి చమత్కౄతికి ఎంతో సంతోషించి ఆభూమికి ఆనుకొని వున్న మరొక అయిదు ఎకరాలు కూడా ఇమ్మని కరణానికి చెప్పి కవి ఆశీర్వాదం పొంది మరొక గ్రామానికి వెళ్ళారు

(తతాకము యొక్క ఉత్తరభూమి ఇది షష్టీ తపురుష
తతాకము వుత్తరముగాకలది ఇది బహువ్రీహి) 
 
(స్వర్గీయ శ్రీ పిలకా గణపతిశాస్త్రి గారికి కృతఙ్ఞతలతో) 

********************

రామలింగని చమత్కృతి
సేకరణ: కాలనాధభట్ట వీ రభద్ర శాస్త్రి
 

ఒకసారి రాయలవారి ఆస్థానంకు ఒక కవి వచ్చాడు. ఆయన తన కవిత్వం సభలో వినిపించాడు. రాయలవారు సహా అంతా అతని కవిత్వానికి ఆనందించారు. సభలో ఆయనతో బాటు వచ్చిన అంతేవాసులు ఓహో ఆహా మీకవిత్వం అష్టదిగ్గజాల కవిత్వానికి తీసిపోనిదిగా, ఇంకా చెప్పాలంటే మరికొంచెం ఎక్కువ సొగసుగావుంది అని పొగిడారు. సభలోని కొంతమంది పామరులుకూడా ఆయన కంఠస్వర మాధ్యుర్యానికి ముగ్ధులై అవునవును అని తలవూపారు. దాంతో ఆ కవిగారికి కించిత్ గర్వం వచ్చింది. ఆయన తలవూపుతూ కూర్చున్న కొయ్యకుర్చీకి వీపును రాయసాగాడు. పాపం ఆయనకు వీపు దురద ఎక్కువ. అందుచేత అందిన ఆధారాన్ని వౄధాపోనివ్వక సద్వినియోగం చేసుకొంటూవుంటారు.  ఈ పొగడ్తలకు అష్టదిగ్గజాలు కొంచెం చిన్నబుచ్చుకున్నారు. ఇంతలో రామలింగడు లేచి ప్రభూ తమశలవైతే నేనుకూడా కవిగారి గురించి ఒక పద్యం చెప్తాను అన్నాడు. అల్లాగే అని రాయలవారు తలవూపారు. అప్పుడు రామలింగడు ఇల్లా పద్యం చెప్పాడుట.
అల్లసానివారి అల్లిక జిలుగులు
ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు
పాండురంగనాధు పదగుంభనమును
కాకమాను, రాయ కలవు నీవు
అంటే అల్లసానివారి జిలుగుపలుకులు, ముక్కుతిమనార్యుని ముద్దుపలుకులు, తనపాందురంగ కావ్య పదగుంభనము మించినకవితను రాయగలవునీవు అని అర్ధం
ఇంకేం కవిగారు తనను రామలింగడంతటివాడు పొగిడాడని వీపుని కర్ర కుర్చీకి తెగరాయసాగాడుట.  మిగిలిన అష్టదిగ్గజాలు తెల్లబోయారుట.
కవిగారు లేచి ప్రభూ ఏ కవితనైనా హేళనచేసి తీసిపారేసే రామలింగకవే నాకవితనుమెచ్చుకున్నారు గనుక, ఆష్టదిగ్గజాలు తమకన్నా నాకవితే ఘనం అని ఒక ధృవీకరణ పత్రం ఇప్పించాలి అని కోరాడుట.
వెంటనే రామలింగడు లేచి ప్రభూ కవిగారు సరిగ్గా విన్నట్లు లేదు. మరలాచదువుతా అని

అల్లసానివారి అల్లిక జిలుగులు
ముక్కుతిమ్మనార్యు ముద్దు పలుకు
పాండురంగ నాధు పదగుంభనమును
కాక, మానురాయ కలవునీవు

అని పదవిరామం చేసి చదివాడుట.
అంటే అల్లసానివారి జిలుగుపలుకులు, ముక్కుతిమనార్యుని ముద్దుపలుకులు, తనపాందురంగ కావ్య పదగుంభనము కాక, నువ్వు మానుని మాత్రమే రాయగలవు అనగా మాను (కర్ర కుర్చీకి వీపుకి దురద వచ్చి గోక్కోగలవు) రాయగలవు అని అర్ధం వచ్చేటట్లు కాక అనేచోట విరామం ఇచ్చి చదివాడుట.
ఆ తరువాత సిగ్గుతో కవి తలవంచుకొన్నాడుట.

(ఈటీవీ 2 తెలుగు వెలుగు కార్యక్రమం నుంచి
శతావధాని శ్రీ గరికిపాటివారికి కృతఙ్ఞతలతో)