Sub: Request for publishing your department's website in Telugu - Reg
(Note: Select view->encoding->unicode(UTF8) in your browser, if you have problem seeing telugu
script. English version also is given below.)
గౌరవనీయులైన
అధికారులకు,
మేము "తెలుగు
మేథస్సు" అను స్వచ్ఛంద
సమూహానికి ప్రాతినిధ్యం
వహిస్తున్నాము. మా ఆశయాల,
లక్ష్యాల వివరణకు మా
వెబ్ సైటును ఈ చిరునామా
వద్ద పరిశీలించగలరు:
http://telugubrains.tripod.com
మా కార్యకలాపాలలో
భాగంగా, మేము ప్రస్తుతం
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ
సంస్థల మరియు శాఖల వెబ్
సైట్లలో తెలుగు ఎంత వరకు
ఉపయోగిస్తున్నారు అనే
అంశం మీద అధ్యయనం చేస్తున్నాము.
మా పరిశీలనలో మీ శాఖకు
చెందిన వెబ్ సైటు పూర్తిగా
ఆంగ్లమునే వాడుతున్న
విషయము గమనించినాము:
* provide link
మీరు మీ శాఖ వెబ్
సైటును తెలుగులో కూడా
ప్రచురించ వలసిన అవసరము
వుందని మేము భావిస్తున్నాము.
దానికి మీరు క్రింద విశదీకరించిన
కారణాలను పరిగణనలోనికి
తీసుకొనవచ్చు:
* మన రాష్ట్ర
ప్రజలు వెబ్ సైట్లను
తెలుగులో చదవడానికే ఎక్కువగా
ఇష్టపడతారు మరియు తెలుగులో
చదవడం వారికి ఎంతో సౌకర్యముగా
ఉంటుంది. మన రాష్ట్రంలో
చాలా మందికి ఆంగ్లము
చదవడం రాదు.
* రాష్ట్ర
శాఖ వెబ్ సైట్లను, రాష్ట్ర
భాష అయిన తెలుగులో ప్రచురించడం
ఎంతో మర్యాద పూర్వకంగా
ఉంటుంది. అంతే కాక, మీ శాఖ
సైట్ ను ఎక్కువ మంది చూడడానికి
అవకాశం ఉంటుంది.
* మీరు
తెలుగులో ప్రచురించిన
వెబ్ పేజీలు, చూసే వారికి
సాంస్కృతిక పరమైన అనుభూతిని
ప్రసాదిస్తాయి.
* మీరు
చెప్పదలచుకున్న సమాచారాన్ని
తెలుగు భాష అత్యంత సమర్థవంతంగా
తెలుగు ప్రజలకు చేరవేస్తుంది.
మీ శాఖ యొక్క పనితనం బాగా
పెరుగుతుంది.
* తెలుగు
వెబ్ సైట్ వలన విలువైన
సమాచారం, అవసరమైన రాష్ట్ర
ప్రజలకు, వారికి తెలిసిన
భాషలో అందజేయబడుతుంది.
* ఇంతకు ముందు, తెలుగులో
వెబ్ సైట్లను ప్రచురించడం
చాల కష్టంతో కూడుకొన్న
పని. కాని ప్రస్తుతం తెలుగు
యూనికోడ్ వలన, మరియు తెలుగులో
వెబ్ సైట్లను ప్రచురించడానికి
మంచి సామగ్రి ఉపయుక్తంగా
ఉండడం వలన, తెలుగులో వెబ్
సైట్లను తయారు చేయడం
చాలా సులభతరం అయ్యింది.
ప్రస్తుతం వెబ్ సైట్లను
ఆంగ్లములో ప్రచురించడానికి
లేదా మరి ఏ ఇతర భాషలలో
నైనా ప్రచురించడానికి
ఎటువంటి వ్యత్యాసము లేదు.
* క్రింద ఉదహరించబడిన
తెలుగు వెబ్ సైట్, పైన
చెప్పిన దానికి తార్కాణము.
ఆంగ్లమువలే తెలుగులో
కూడా శోధించ వచ్చు.
http://eemaata.com/em/
* మేము కూడా మీకు తెలుగు
వెబ్ సైట్లను తయారు చేయడానికి
కావలసిన సంపూర్ణ సహాయ
సహకారాలను అందించగలం.
మార్గదర్శకత్వము, వనరుల
సమీకరణ, అనువాదము మరియు
వెబ్ సైట్ నిర్వహణలో
మీ వెబ్ సైట్ తయారు చేసే
వారికి మేము సహకరించగలము.
పై విషయములను పరిగణనలోనికి
తీసుకొని, దయచేసి మీ శాఖ
యొక్క వెబ్ సైటును తెలుగులో
కూడా ప్రచురించ వలసినదిగా,
మా అందరి సవినయ ప్రార్ధన.
అభివాదములు,
తెలుగు
విస్తరణ విభాగము
"తెలుగు
మేథస్సు"
ఈ-మెయిల్:
telugubrains@yahoo.co.in
మా కూటమి తాలూకు చర్చావేదిక
యొక్క వెబ్ చిరునామా:
http://groups.yahoo.com/group/TeluguBrains/
(English version follows)
************************************
Dear Sir/Madam,
We are representing the Telugu enthusiasts group called "TeluguBrains".
For our aims and objectives, please go through the following link:
http://telugubrains.tripod.com
As part of our activity we are reviewing all Andhra Pradesh state department
websites, for their usage of telugu language for communicating with the people of state. We found the website represented
by your department is completely in English.
* Provide Link
We strongly feel that there is a need for publishing your department's
website in Telugu. These are the points you can consider for proceeding towards this action:
* Our State people tend to be most comfortable viewing websites in
Telugu language. Majority of the people cannot read English.
* Telugu language support is a courtesy that increases trust in your
Department while encouraging repeated and longer site visits.
* Telugu language content can help deliver a more culturally relevant
experience to your site visitors.
* It not only optimizes the communication of your message and services
but also contributes to an organization's bottom line in various ways.
* If your website is in Telugu, it delivers valuable material to those
in need, in a language they can understand.
* Previously website publishing in Telugu was difficult. But with the
advent of Unicode and good tools for Telugu web publishing, it is easy to publish websites in Telugu. Now there is no difference
in publishing the websites in Telugu or any other language.
* Here is one example site published in Telugu Unicode. Here you can
search in Telugu also.
http://eemaata.com/em/
* We ourselves are ready to support you in the form of guidance, translation, and
preparation of material in Telugu and support maintenance of your website, working along with your website developer.
We request you to kindly consider publishing your website in Telugu for
the benefit of all people of our State.
Regards,
Telugu Propagation Section,
"TeluguBrains"
Email:
telugubrains@yahoo.co.in
***************************