షెర్లాక్ హొంస్ తో
నాకున్న సుదీర్ఘ పరిచయంలొ,
అతను ఎప్పుడు తన వారి
గురించి, తన బంధువుల గురించి
చెప్పలేదు. కనీసం తన పూర్వ
జీవితం గురించి కూడా
పలకరించ లేదు. అతని మనసు
బయట పడని ప్రవర్తన, అతను
మానవీయత లేని మనిషి అన్న
నా అభిప్రాయాన్ని బలపరుస్తు
ఉండేది. కొన్నిసార్లు
అతను ప్రత్యేక మనిషని,
మనసులేని మేధస్సు అని,
తెలివి ఎక్కువ అవడంవలన
కరుణ తక్కువ అయ్యిందేమొ
అని అనిపించేది. ఆడవారంటే
మక్కువ లేకపోవడం, కొత్త
స్నేహాలు చేయడానికి ఇష్టపడక
పోవడం, అతని భావరహిత స్వభావానికి
అద్దం పట్టేవి. అతను అతని
బంధువుల గురించి అన్ని
విషయాలను దాచిపెట్టడం,
ఈ ఆలోచనను ఇంకా బల పరిచేది.
అతను బంధువులు ఎవరు లేని
ఒక అనాధ అని అనుకొనే వాడిని.
కాని ఒక రోజు, అతను తన సొదరుని
గురించి మాట్లాడడం మొదలు
పెట్టే సరికి నేను చాలా
అశ్చర్య పొయాను.
ఒక వేసవి కాలం సాయంత్రం,
టీ తరువాత, మా సంవాదము
ఒక నియమము లేకుండా గొల్ఫ్
క్లబ్బుల నుండి కాంతి
వృత్తములో వకృత్వానికి
కల కారణాల వరకు సాగుతు
చివరికి వారసత్వపు సహజ
సామర్థ్యాలకి మళ్లింది.
ఒక మనిషిలో ఉన్న ఉన్నత
సామర్థ్యానికి అతని
పూర్వికుల సామర్థ్యం
ఎంత దొహదపడుతొంది మరియు
అతని స్వయంక్రషి ఎంత
దొహద పడుతొంది అనే అంశము
మా చర్చాంశము అయ్యింది.
"మీ విషయంలో, మీరు ఇంత
వరకు నాకు చెప్పిన దానిని
బట్టి, మీ నిశితంగా పరిశిలించే
స్వభావము, వింతగా విశ్లేషించే
విధానము, మీరు పద్దతి
ప్రకారము చేసిన అభ్యాసము
వలనే వచ్చినట్లు అనిపిస్తుంది"
అన్నాను నేను.
"కొంత వరకు," బదులు ఇచ్చారు,
అతను, ఆలోచిస్తు, "నా పూర్వీకులు
సైన్యంలో పని చేసెవారు,
వారు స్వతహాగా వారి తరగతి
వారి లాగే తమ జీవితం గడిపే
వారు. ఐన కూడా, నా ఆ స్వభావం
నా నరాల్లోనే ఉంది, మరియు
నా బామ్మ దగ్గర నుంచి
వచ్చి ఉంటుంది. ఆమె వర్మెట్
సహొదరి, ఫ్రెంచ్ కళాకారిని.
కళ రక్తంలో ఉంటే, అది వివిధ
రూపాల్లో బయట పడ వచ్చు."
"కాని అది అనువంశిక
మైనదని మీకు ఎలా తెలుసు."
"ఎందుకంటే, నా సొదరుడు,
మైక్రాఫ్ట్ నా ఆ స్వభావం
నా కంటే ఎక్కువ మొతాదులో
కలిగి ఉన్నాడు."
ఇది నాకు పెద్ద విశేషము.
ఇంగ్లాండులో అలాంటి ప్రత్యేక
స్వభావము ఉన్న వ్యక్తి
ఇంకొకరు ఉంటె, అతని గురించి
పోలిసులు కాని ప్రజలు
కాని ఎందుకు వినలేదు?
అదే విషయం అడిగాను నేను.
తన సొదరుని తన కంటె గొప్పవాడుగ
గుర్తించడం నా సహచరుని
నిగర్వ స్వభావమే అని
సూచించాను. నా సూచనకి
హోంస్ నవ్వారు.
"నా ప్రియమైన వాట్సన్,"
చెప్పారు అతను,"నిగర్వాన్ని
ఒక మంచి స్వభావము అనే
వాళ్లతొ నేను ఏకీభవించను.
ఒక లాజీషియను అన్ని పరిస్తితులను
యధాతదంగా చూడాలి, తనని
తక్కువ అంచనా వేసుకొవడం
ఒక సత్యానికి ఎంత దూరమో
తనని గురించి గొప్పగా
చెప్పుకోవడం కూడా అంతే
దూరం. కాబట్టి, మైక్రాఫ్ట్
నా కంటే గొప్ప పరిశీలనా
శక్తి కలవాడని నేను చెప్పినప్పుడు,
దానిని ఉన్న విషయాన్ని
యధాతదంగా చెపుతున్నట్టు
భావించ వచ్చు."
"అతను మీ కంటె చిన్నవారా?"
"నా కంటె ఏడు సంవత్సరాలు
పెద్ద."
"అతని గురించి ఎవరికి
ఎందుకు తెలియదు?"
"అతని చుట్టు పక్కల
అతని గురించి బాగా తెలుసు."
"ఎక్కడ?"
"డయొజిన్స్ క్లబ్బు,
ఒక ఉదాహరణ."
నేను ఈ సంస్థ గురించి
ఎప్పుడు వినలేదు. ఆ విషయము
నా మొహంలొ ప్రతిబింబించి
ఉంటుంది. ఎందుకంటె షెర్లాక్
హొమెస్ తన గడియారము తిసుకొన్నారు.
"డయొజిన్స్ క్లబ్బు,
లండనులో ఉన్న ఒక వింత
క్లబ్బు. మైక్రాఫ్ట్
ఒక వింత మనిషి. పదిహేను
నిమిషాలు తక్కువ ఐదు
నుండి, ఇరవై నిమిషాలు
తక్కువ ఎనిమిది వరకు
అతను అక్కడ ఉంటారు. ఇప్పుడు
ఆరు అయ్యింది. మీకు ఇప్పుడు
ఈ అందమైన సాయంత్రంలో
సరదాగా నడవాలని అనిపిస్తే,
మీకు నేను రెండు ఆసక్తికరమైన
వాటిని పరిచయం చేస్తాను."
ఐదు నిమిషాల తరువాత
మేము విధిలో ఉన్నాము.
రీజెంట్ సర్కస్ వైపు
నడుస్తు.
"మీరు ఆశ్చర్యపొవచ్చు,"
అన్నారు నా సహచరుడు, "మైక్రాఫ్ట్
తన శక్తులను అపరాధ పరిశోధనకు
ఎందుకు ఉపయొగించరు అని.
అతనికి అంత సామర్ధ్యం
లేదు."
"కాని మీరు చెప్పారు..."
"అతను పరిశీలించండంలో
మరియు విశ్లేషించడంలో
నా కంటె గొప్పవారు. అపరాధ
పరిశోధన అనే కళ ఒక కుర్చిలో
కుర్చొని మొదలై, మల్లి
అక్కడె అంతం అయ్యేది
అయితే, నా సొదరుడు ప్రపంచంలోనే
గొప్ప అపరాధ కర్త అయ్యుండెవారు.
కాని అతనికి ఆశ కాని, శక్తి
కాని లేవు. అతని పరిష్కారాన్ని
సరిచూసుకొవడానికి కూడా
అతను బయటకి కదలరు. తన పరిష్కారము
సరి అయ్యింది అని నిరూపించడానికి
పడే కష్టానికన్నా, సరి
కాదని ఒప్పుకోంటరు. నేను
చాలా సార్లు అతని దగ్గరకు
సమస్యలను తీసుకువెళ్లాను.
అతని వివరణని తీసుకొన్నను.
అతని విశ్లేషణ సరి అయినదని
తరువాత నీరూపించబడింది.
కాని అతనికి ఒక న్యాయాధిపతి
దగ్గరకు ఒక అభియొగాన్ని
తిసుకొని వెళ్లడానికి
కావలసిన కొన్ని అచరణాత్మక
విషయాల సేకరణ గురించి
తెలియదు."
"అది అతని వృత్తి కాదు,
ఐతే?"
"అన్ని విధాలుగా. ఏదైతే
నాకు జీవనాధరమొ అది అతనికి
కేవలం హాబీ మాత్రమే. అతనికి
అంకెలతో బాగా పట్టుంది.
అతను కొన్ని ప్రభుత్వ
శాఖలలొ పుస్తకాలా తనిఖి
కూడ చేస్తూ ఉంటారు. అతను
పాల్ మాల్ లో నివాసము
ఉంటు, సందు చివర వైట్ హాలు
వరకు నడుచుకుంటు వెళ్లి,
మళ్లి సాయంత్రం నడుచుకుంటు
తిరిగి వస్తారు. ఒక సంవత్సరాంతము
నుండి ఇంకో సంవత్సరాంతము
వరకు అతనికి ఇంకొ వ్యాయామము
లేదు. అతను అతని గదుల ముందున్న
డయొజిన్స్ క్లబ్బులో
తప్ప ఇంకెక్కడ కనిపించరు."
"ఆ పేరు నేను ఎప్పుడు
వినలేదు."
"వినుండక పొవచ్చు. మీకు
తెలిసే ఉంటుంది, లండనులో
చాలా మంది పురుషులు, కొంత
మంది తమ బిడియము వలన మరి
కొంత మంది మానవజాతి పై
ద్వేషముతో, ఇతరుల సహచర్యము
ఇష్టపడరు. హాయిగా ఉండె
కుర్చిలు, మంచి వార్త్తా
పత్రికలు అంటే వారికి
అయిష్టము లేదు. ఇటువంటి
వారి కోసమే డయొజిన్స్
క్లబ్బు స్థాపించబడింది.
అందులో ఇప్పుడు నగరంలోని
ఎవ్వరితో కలవని, కలపలేని
వ్యక్తులు ఉన్నారు.
ఒక అపరిచిత వ్యక్తుల
గదిలో తప్పితే, ఇంక ఏ గదిలోను
మాట్లడడం నిషేదించబడింది.
ఎవరైన మూడు సార్లు తప్పు
చేసినట్లు కమిటి దృష్టికి
వస్తే వారి సభ్యత్వము
రద్దు చెయ్యబడడానికి
అర్హులు. దానిని స్థాపించిన
వారిలో నా సోదరుడు కూడ
ఒకరు. కొన్ని సార్లు ఆ
వాతావరణం నాకు కూడ హాయిగా
అనిపిస్తుంది."
"వినుండక పొవచ్చు. మీకు
తెలిసే ఉంటుంది, లండనులో
చాలా మంది పురుషులు, కొంత
మంది తమ బిడియము వలన మరి
కొంత మంది మానవజాతి పై
ద్వేషముతో, ఇతరుల సహచర్యము
ఇష్టపడరు. హాయిగా ఉండె
కుర్చిలు, మంచి వార్త్తా
పత్రికలు అంటే వారికి
అయిష్టము లేదు. ఇటువంటి
వారి కోసమే డయొజిన్స్
క్లబ్బు స్థాపించబడింది.
అందులో ఇప్పుడు నగరంలోని
ఎవ్వరితో కలవని, కలపలేని
వ్యక్తులు ఉన్నారు.
ఒక అపరిచిత వ్యక్తుల
గదిలో తప్పితే, ఇంక ఏ గదిలోను
మాట్లడడం నిషేదించబడింది.
ఎవరైన మూడు సార్లు తప్పు
చేసినట్లు కమిటి దృష్టికి
వస్తే వారి సభ్యత్వము
రద్దు చెయ్యబడడానికి
అర్హులు. దానిని స్థాపించిన
వారిలో నా సోదరుడు కూడ
ఒకరు. కొన్ని సార్లు ఆ
వాతావరణం నాకు కూడ హాయిగా
అనిపిస్తుంది."
మేము మాట్లాడుకుంటు
పాల్ మాల్ చేరుకున్నాము.
సేయింట్ జేంస్ చివర నుండి
మేము అటువైపు నడిచాము.
కార్ల్ టన్ దగ్గర నుండి
కాస్త దూరంలో ఒక తలుపు
దగ్గర ఆగి, షర్లాక్ హోంస్
నన్ను మాట్లాడవద్దని
గుర్తు చేసి, ఒక హాలు లోనికి
నడిచారు. గాజు గోడల నుండి
నేను విశాలమైన గదిని
కాస్త గమనించాను. చాల
మంది వ్యక్తులు ఏదొ ఒక
మూలన కూర్చొని వార్తా
పత్రికలు చదువుకుంటున్నారు.
హోంస్ నాకు పాల్ మాల్
ను నేరుగ చూడగలిగే ఒక
చిన్న గదిని చూపించారు.
నన్ను అక్కడ ఒక నిమిషము
వదిలి వెళ్లి, మళ్లి ఒక
సహచరునితో తిరిగి వచ్చారు.
అతనే హోంస్ సహోదరుడు
అని నాకు అర్ధం అయ్యింది.
మైక్రాఫ్ట్ హోంస్, షర్లాక్
హోంస్ కన్నా పెద్దగా
మరియు ధృడంగా ఉన్నారు.
Next Page
|